
క్రీడలు

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రాధాకృష్ణకు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్కు పరిచయం చేశారు. వారందరితో ఆప్యాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, వారితో ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తూ, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!