

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రానికి విచ్చేసిన ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ పుష్పగుచ్ఛం అందించి ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఉపరాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
అనంతరం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం, రూబీ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ పర్యటన అనంతరం సీపీ రాధాకృష్ణన్ మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!