

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26న ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.. అక్కడి నుంచి అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించనున్నారు. అనంతరం అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించనున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి చేరుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు. ఈ నెల 27న ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఏపీ అధికారులు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!