

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆలయ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
సినీ ప్రముఖులు ఇంద్రకీలాద్రికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. దర్శనం అనంతరం వారు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగడంతో అక్కడ ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ప్రముఖ నటీనటులు కనకదుర్గమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయానికి వచ్చిన భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!