

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను ఒక రోజు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల తేదీని మార్చాలని జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
జిల్లా కలెక్టర్ అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 29న నిర్వహించేందుకు అనుమతించింది. అయితే, ఓట్ల లెక్కింపు తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. సిరిమానోత్సవం నేపథ్యంలో ఓటింగ్ తేదీని మార్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!