

నగరంలో దసరా ఉత్సవాలు సందర్భంగా చోర్బగాన్ సర్బజనిన్ దుర్గా మండపంవద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటన జరగడానికి గల కారణాలను అన్వేషించేందుకు కోల్కతా పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాటకు ముందు అక్కడ నెలకొన్న పరిస్థితులను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో మండపంవద్ద సీసీటీవీ కెమెరాలను వారు జల్లెడ పడుతున్నారు.
పందిరి కూలిపోయే ప్రమాదం ఉందంటూ మైక్రోఫోన్లో ఎవరో హెచ్చరించినట్లు గుర్తించారు. ఈ హెచ్చరికే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని.. ఈ పందిరి కూలిపోతుందని.. దయ ఇక్కడి చేసి వెళ్లండంటూ ఆ వీడియోలో హెచ్చరికలు స్పష్టంగా వినిపిస్తున్నాయని వివరించారు. ఆ ప్రకటన ఎవరూ చేశారు. ఈ హెచ్చరిక వెనుక కారణం ఏమిటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరో వైపు ఈ కార్యక్రమం నిర్వహకులపై సీఎం సువెందు అధికారి మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మైక్రోఫోన్లో ప్రకటనే ఈ ఘటనకు కారణమని స్పష్టం చేశారు. ఇక నిర్వహణ లోపం, గందరగోళ ప్రకటనలు, కుండపోత వర్షం కారణంగా.. తలదాచుకునేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం కారణంగా ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని అంతా భావిస్తున్నారు














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!