

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో జనజీవనం స్తంభించిపోయినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి రావడంతో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో దట్టమైన పొగ, మంటలు, దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓ మహిళ సాధారణంగా జాగింగ్ చేస్తూ వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.
చుట్టూ ఘర్షణలు జరుగుతున్నా, మంటలు ఎగసిపడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె జాగింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని కొందరు ప్రశంసిస్తూ, ఈ వైఖరిని ‘మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్’తో పోల్చారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆమె జాగింగ్ చేస్తుండవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బయటకు రావడం సరైనది కాదంటూ కొందరు ఆమె తీరును విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!