
సినిమాలు

10 లక్షలకు పైగా జనాభా ఉన్న మిలియన్ ప్లస్ నగరాల్లో మహిళా కార్మికులు ఇంకా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నారని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రోజుకు రూ.500 సంపాదించడం కూడా అనేక మంది మహిళా కార్మికులకు కష్టంగా మారిందని నివేదిక పేర్కొంది.
మహిళా నిరుద్యోగిత విషయంలో మదురై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో ప్రతి 100 మంది మహిళల్లో సుమారు 9 మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు, సమాన వేతనాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!