
గాసిప్స్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) తన ప్రేయసి థియా బూయ్‌సెన్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూలై 14న బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన నెకర్ ఐలాండ్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కలిపి సుమారు 70 మంది మాత్రమే హాజరయ్యారు.
వివాహానికి సంబంధించిన అందమైన ఫొటోలను మిస్టర్ బీస్ట్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!