
సినిమాలు

తెలంగాణలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఐదో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రారంభించింది. బుధవారం యూనిట్-5ను గ్రిడ్‌తో అనుసంధానిస్తూ జెన్కో, బీహెచ్ఈఎల్ (BHEL) ఇంజినీర్లు సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో ఈ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో కీలక ముందడుగుగా ఈ పరిణామం నిలిచింది.
ఐదో యూనిట్ అందుబాటులోకి రావడంతో యాదాద్రి పవర్ ప్లాంట్ మొత్తం 4,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంది. అన్ని యూనిట్లు అందుబాటులోకి రావడంతో ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!