
జనరల్

అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు యాసమిన్ అన్సారీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ, ట్రంప్ నాయకత్వం అమెరికాతో పాటు ప్రపంచానికీ ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికారంలో ఉన్న ప్రతి నిమిషం అమెరికన్లు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజల భద్రతకూ ముప్పుగా మారుతోందని ఆమె ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు అమెరికాలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో యాసమిన్ అన్సారీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలపగా, మరికొందరు ట్రంప్‌కు మద్దతుగా స్పందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!