

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి చేసిన బర్త్‌డే విషెస్‌కు పవన్ భావోద్వేగంగా స్పందించారు. చిన్ననాటి నుంచి చిరంజీవి తనపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన అండ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో మొదటి హీరో చిరంజీవేనని పేర్కొన్నారు.
జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల్లో తనను నడిపించిన చిరంజీవి మాటలు, ఆలోచనలు ఇప్పటికీ తనతోనే ఉన్నాయని పవన్ తెలిపారు. కుటుంబం పట్ల అన్నయ్య చూపిన ప్రేమ, సమాజం పట్ల ఆయన బాధ్యత, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే తపనను చూస్తూ తాను పెరిగానని చెప్పారు. ఆ అనుభవాలే తన ఆలోచనలకు దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. చిరంజీవి తన జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి అని, కుటుంబ ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో పాటు అన్నయ్య ఆశీస్సులతో ముందుకు సాగుతానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!