

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ కీలక మార్పులు చేసింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం ఆదాయాన్ని పొందాలంటే ఇకపై మరింత కఠినమైన అర్హతలు సాధించాలి. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా YPPలో చేరాలనుకునే క్రియేటర్లు 1,000 మంది సబ్‌స్క్రైబర్లతో పాటు గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించాలి. ప్రస్తుతం ఉన్న 4,000 వాచ్ అవర్స్, 1 కోటి షార్ట్స్ వ్యూస్ నిబంధనలతో పోలిస్తే ఈ పరిమితులు రెట్టింపయ్యాయి.
ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లపై కొత్త ఎంట్రీ నిబంధనల ప్రభావం ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది. అయితే షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి ఆదాయం పొందాలంటే ఇకపై ప్రతి 90 రోజుల్లో 1 కోటి క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు యూట్యూబ్ ప్రీమియం లైట్ సేవలను ప్రీమియం అందుబాటులో ఉన్న దేశాలకు విస్తరిస్తోంది. భారత్‌లో ప్రీమియం లైట్ నెలకు రూ.89, సాధారణ వ్యక్తిగత ప్రీమియం ప్లాన్ నెలకు రూ.149గా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!