

జర్మనీలో జరిగిన 43వ మున్‌స్టర్‌లాండ్ ఓపెన్–2026 చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. విజయవాడకు చెందిన లలిత్ బాబు తన అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారని ప్రశంసించారు. ఆయన విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ చెస్ క్రీడకు గర్వకారణమని పేర్కొన్నారు. యువ చెస్ క్రీడాకారులకు లలిత్ బాబు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అలాగే, యూరోపియన్ చెస్ క్లబ్ కప్ మహిళల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన కోనేరు హంపికి, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై ఇద్దరూ రాష్ట్ర, దేశ ప్రతిష్ఠను పెంచారని ప్రశంసించారు. వారి విజయాల వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, త్యాగం, పట్టుదల ఉన్నాయని పేర్కొన్నారు. హంపి, సింధు తమ విజయాలతో ఎంతోమంది బాలికలకు స్ఫూర్తినిస్తూ, పెద్ద కలలు కనడానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!