
షోస్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గవర్నర్తో భేటీ కోసం వైసీపీ అపాయింట్మెంట్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్నాయని ఆరోపిస్తున్న దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై జరిగిన దాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అలాగే రాయచోటిలో వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటన, పులివెందులలో కాల్పుల ఘటనలపైనా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్తో భేటీకి సంబంధించిన అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!