
షోస్

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సమయంలో సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్కు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పిటిషన్లో సవాల్ చేసింది.
తిరుపతి, కడప, పులివెందుల ప్రాంతాల్లో నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఘటనలను వైసీపీ పిటిషన్లో ప్రస్తావించింది. తమ పార్టీ అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని విజ్ఞప్తి చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!