

టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ చిత్రం టైటిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘సంక్రాంతి సరుకు’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో విడుదల కానున్న సినిమా కావడంతో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా టైటిల్ ఉండాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటికే ఈ టైటిల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!