

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా డార్క్, రా టోన్‌తో సినిమాలను తెరకెక్కించే ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్ కోసం తన శైలికి భిన్నంగా కలర్‌ఫుల్ విజువల్ ట్రీట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను మరింత వైబ్రెంట్‌గా, రంగులమయంగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం భుజం ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్.. అక్టోబర్ మొదటి వారం నుంచి ‘డ్రాగన్’ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. నీల్ మార్క్ డార్క్ టేకింగ్‌కు ఎన్టీఆర్ ఎనర్జీకి తోడు కలర్‌ఫుల్ విజువల్స్ కూడా జత అయితే సినిమా మరింత ప్రత్యేకంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!