

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ నెట్‌వర్క్‌కు చెందిన కావ్య మారన్‌ల పెళ్లిపై వస్తున్న వార్తలు సినీ, క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వీరిద్దరూ గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు వెళ్లేందుకు నాలుగు చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. కలానిధి మారన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, అనిరుధ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబాలు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, పెళ్లి తేదీ, ఏర్పాట్లు, అతిథుల వివరాలపై ఇప్పటివరకు అనిరుధ్ లేదా కావ్య నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పెళ్లి అనంతరం మూడు వేర్వేరు ప్రాంతాల్లో రిసెప్షన్లు నిర్వహించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒక వేడుకను ప్రత్యేకంగా సన్ నెట్‌వర్క్ సిబ్బంది కోసం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మిగతా వేడుకలకు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని ప్రచారం సాగుతోంది. జైలర్ సినిమా విడుదల సమయంలో అనిరుధ్, కావ్య ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు గతంలో వెలువడ్డాయి. తాజాగా జైలర్ 2 విడుదల నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే, వీరి సంబంధం, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనందున ఈ వివరాలను ప్రస్తుతానికి ప్రచారంగానే పరిగణించాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!