

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం విడుదల విషయంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ప్రకటించిన ఈ సినిమా ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడింది. తొలుత సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినా, సెన్సార్ అభ్యంతరాల కారణంగా రిలీజ్ ఆగిపోయింది. తాజాగా జూన్ 19న విడుదల చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికీ అధికారిక స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఇక ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులకు సంబంధించిన అంశం కూడా చర్చనీయాంశమైంది. విడుదల ఆలస్యం కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని KVN ప్రొడక్షన్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అన్ని థియేట్రికల్ డీల్స్‌ను రద్దు చేసి, కొత్త విడుదల తేదీ ఖరారైన తర్వాత స్వయంగా సినిమాను విడుదల చేయాలని విజయ్ సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!