
జనరల్

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య వింటేజ్ మాస్ ఇమేజ్‌కు ఆధునిక టచ్ జోడిస్తూ ఆయనను సరికొత్తగా చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, భావోద్వేగాలు, వినోదానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా ఒక ప్రధాన ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విజువల్ క్వాలిటీ, మాస్ ఎలివేషన్స్‌తో పాటు థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!