

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న RC17 సినిమాకు ఈ నెలలో అధికారికంగా ప్రారంభోత్సవం జరగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ధురంధర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ నటి అనీత్ పడ్డా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె నటించిన తొలి చిత్రం సైయారా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో అనీత్ పడ్డాకు యువతలో మంచి గుర్తింపు లభించింది. RC17లో ఆమె నటించనున్నారనే ప్రచారంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సుకుమార్ చివరకు ఎవరిని కథానాయికగా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తారాగణం, చిత్ర బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!