

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో ‘కాకా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారంలోపు మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, అనిల్ కపూర్ నటనపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుందని, చిరంజీవిని కొత్త తరహా పాత్రలో చూపించేందుకు బాబీ కొల్లి ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది. సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాతలు, ‘కాకా’ను 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!