

నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర బృందం వరుసగా ప్రచార కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచార వీడియోలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర పంపిణీ బాధ్యతలను దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) చేపట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ చిత్రాలకు ఘనంగా విడుదలలు నిర్వహించే దిల్ రాజు, ఈ సినిమాను కూడా విస్తృత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని భావిస్తున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, అరుణ్ గోవిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణం, ప్రతిష్ఠాత్మక నిర్మాణంతో రూపొందుతున్న ‘రామాయణ’ విడుదలపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!