

దృశ్యం ఫ్రాంచైజీ విషయంలో మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మలయాళ దృశ్యం సిరీస్‌కు కొనసాగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దృశ్యం4పై అధికారిక ప్రకటన రావడంతో జార్జ్‌కుట్టి కథ మరిన్ని మలుపులు తిరగనుందనే ఆసక్తి పెరిగింది. మరోవైపు హిందీలో అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం సిరీస్‌ను మూడో భాగంతో ముగించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దృశ్యం3 చివరి అధ్యాయంగా మారే అవకాశముంది.
తెలుగులో వెంకటేష్ నటించిన దృశ్యం, దృశ్యం2 సినిమాలు మంచి స్పందన అందుకున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లడంపై వెంకటేష్ ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దృశ్యం2తోనే తెలుగు వెర్షన్ ప్రయాణం ముగిసినట్టుగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా దృశ్యం2 నేరుగా ఓటీటీలో విడుదల కావడం కూడా ఈ సిరీస్‌లో కీలక పరిణామంగా నిలిచింది. ఇలా ఒకే కథా ప్రపంచానికి 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు ఏర్పడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!