

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు లేకపోవడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జగపతిబాబు పోషించిన అప్పలసూరి పాత్రను మరింత బలంగా చూపించాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవల జగపతిబాబు కూడా రామ్ చరణ్‌తో తన పాత్రకు సంబంధించిన మరికొన్ని బాండింగ్ సన్నివేశాలు ఉంటే సినిమా ఇంకా బాగుండేదని పేర్కొన్నారు. అలాగే జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర ప్రభావం హీరో పాత్రపై ఎలా పడిందనే అంశం కూడా పూర్తిస్థాయిలో చూపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ కోసం చిత్రబృందం 3 గంటల 25 నిమిషాల నిడివితో ప్రత్యేక వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్‌లో తొలగించిన పలు భావోద్వేగ సన్నివేశాలతో పాటు అప్పలసూరి, అచ్చియమ్మ పాత్రలకు సంబంధించిన అదనపు కంటెంట్‌ను జోడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రీ-క్లైమాక్స్‌కు ముందు నిడివి కారణంగా తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా తిరిగి చేర్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!