
జనరల్

విజయ్ దేవరకొండ, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారాయి. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిలిమ్స్ కార్యాలయంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. భారీ స్థాయి కాన్సెప్ట్‌ను విక్రమ్ విజయ్‌కు వినిపించగా, ఎమోషనల్ డెప్త్ మరియు కమర్షియల్ అంశాలు నచ్చడంతో హీరో ఓకే చెప్పినట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని, పాన్ ఇండియా స్థాయిలో మ్యాడాక్ ఫిలిమ్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మనం, 24 వంటి విభిన్న చిత్రాలతో పాటు దూత వెబ్ సిరీస్‌తో మెప్పించిన విక్రమ్ కుమార్‌తో విజయ్ సినిమా వస్తుందన్న వార్తలతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!