

జైలర్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణలో కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పలు చర్చల అనంతరం హృతిక్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, జూన్ 22 తర్వాత షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఆయన పాత్రను భారీ స్థాయిలో, కథలో ప్రత్యేక ప్రాధాన్యంతో రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!