

తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్.. అభిమానులు కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్‌లకే పరిమితం కాకుండా తమ ప్రాంతాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ప్రజలు, కుటుంబాల అవసరాలను తెలుసుకుని వారికి సాధ్యమైనంత సహాయం చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించిన నటుడు విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’కు లభించిన గుర్తింపుపై వచ్చిన విమర్శలకు ధనుష్ స్పందించారు. ఆ ఏడాది ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయని ప్రేక్షకులు భావించడాన్ని తాను గౌరవిస్తానని, ఇతర చిత్రాల అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పులేదని పేర్కొన్నారు. విమర్శలను పక్కనపెట్టి ఈ విజయాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన పలు మంచి చిత్రాలకు అవార్డులు వస్తాయని ఆశించినప్పటికీ అలా జరగలేదని గుర్తుచేసుకున్న ధనుష్.. ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియాన్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!