

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ చిత్రం ‘దాదా’. ఇప్పటికే విడుదలైన టైటిల్ మెరుపుచిత్రం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయక ఛాయలున్న శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ‘మిరాయ్’ తర్వాత మనోజ్ మరోసారి విలన్ తరహా పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాలకృష్ణకు ఎదురుగా ఆయన క్రూరమైన పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం.
దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మంచు మనోజ్ కనిపించని విధంగా ఈ పాత్రకు ప్రత్యేకమైన, భయపెట్టే రూపాన్ని సిద్ధం చేస్తున్నారట. కథలో ఈ పాత్రకు కీలక ప్రాధాన్యం ఉండటంతో పాటు బాలకృష్ణతో జరిగే సంఘర్షణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!