

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల కోసం ఆసక్తికరమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో ఆయన సినిమా చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మాత నాగవంశీ నిర్మించనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ‘జైలర్ 2’ తెలుగు హక్కుల వ్యవహారంలో నాగవంశీ తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చకు వచ్చింది. ఈ సినిమాపై ఆయన పెట్టిన పెట్టుబడి వెనుక ఉన్న కారణాలపై గతంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు నెల్సన్తో చేయబోయే కొత్త సినిమా నేపథ్యంలో ఆ నిర్ణయానికి సంబంధం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు నాగవంశీ వెల్లడించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. రజినీకాంత్, నెల్సన్, అనిరుధ్ కలయికపై నమ్మకంతోనే ‘జైలర్ 2’ తెలుగు హక్కుల విషయంలో ముందడుగు వేసినట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అయితే ఎన్టీఆర్నే కథానాయకుడిగా ఎంపిక చేశారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఈ కాంబినేషన్పై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా ఖరారైతే, టాలీవుడ్, కోలీవుడ్ కలయికలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు తెరపైకి వచ్చినట్లవుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!