

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 50వ సినిమా ఏది అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఎల్‌సీయూలో భాగంగా రోలెక్స్ పాత్రను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక చిత్రం తెరకెక్కించే ఆలోచన ఉందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి సంచలనం సృష్టించారు. దీంతో అదే పాత్రపై ప్రత్యేక సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం సూర్య 47వ సినిమాతో బిజీగా ఉన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ తర్వాత టి.జె. జ్ఞానవేల్, హెచ్. వినోత్‌లతో సినిమాలు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ల అనంతరం సూర్య 50వ సినిమాగా రోలెక్స్‌ను రూపొందించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రోలెక్స్ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ నిజమైతే భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!