
షోస్

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథలో అఖిల్ గుడ్డివాడి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
‘లెనిన్’ విజయంతో అఖిల్ తన తదుపరి సినిమాను మరింత జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడితో అఖిల్ సినిమా చేయనున్నాడని, కథ కూడా సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!