

మెగా హీరో సాయిదుర్గా తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ‘సంబరాల ఏటిగట్టు’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఆయన, మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ కాకుమాను ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రకృతి, వన్యప్రాణులకు ప్రాధాన్యం ఉండనుందని, ముఖ్యంగా పులి కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో అడవిలో సాగే భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. పులికి సంబంధించిన సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చిత్రబృందం ప్రీ-విజువలైజేషన్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సప్తమి గౌడ ఈ చిత్రంలో సాయిదుర్గా తేజ్ సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె హిందీ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’, నితిన్ నటించిన తెలుగు చిత్రం ‘తమ్ముడు’లోనూ కనిపించారు. అయితే హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, రోహిత్ కేపీ దర్శకత్వంలో రూపొందిన ‘సంబరాల ఏటిగట్టు’లో సాయితేజ్ ‘బలి’ పాత్రలో కనిపించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించగా, శ్రీకాంత్, జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!