

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త యాక్షన్ ఎంటర్టైనర్పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, నాగార్జునను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం వామికా గబ్బి పేరును పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సూర్య, జ్యోతికలకు చెందిన జ్యోతికల జగరమ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
ఇటీవల ‘కూలీ’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించిన నాగార్జున, ప్రస్తుతం తన 100వ చిత్రం ‘కింగ్ 100’ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు సూర్య తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత హెచ్. వినోద్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈ సినిమాలో భాగమవుతారనే వార్త నిజమైతే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు ఇది ప్రత్యేకమైన కాంబినేషన్‌గా మారనుంది. అయితే నాగార్జున పాత్ర, సినిమా వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!