

నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలుత నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన ఈ చిత్రాన్ని, 2027 జనవరి చివరి వారానికి వాయిదా వేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరుసగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వద్ద పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, విడుదల తేదీ మార్పుపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’లో రష్మిక గోండ్ గిరిజన మహిళగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె శక్తివంతమైన పాత్రతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ప్రత్యేకంగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, విడుదల తేదీ మార్పు వార్తలు మరింత చర్చకు దారితీశాయి. అయితే, సినిమా నిజంగానే వాయిదా పడుతుందా లేదా అనుకున్న తేదీకే విడుదలవుతుందా అనేది చిత్రబృందం అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!