

నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జడల్ జమానా’ ప్రచారంతో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం విడుదల విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండటంతో అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, విడుదల ఎప్పుడు అనే అంశాలపై చర్చ కొనసాగుతున్న సమయంలో తాజా సమాచారం ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం చిత్రబృందం భారీ స్థాయిలో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భాగం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ పూర్తయిన తర్వాత మిగిలిన పనులను కూడా త్వరగా ముగించాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. దీంతో సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకోనుంది. ఇటీవల సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ కూడా క్లైమాక్స్ గురించి ఇచ్చిన హైప్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మిస్తుండగా, విడుదలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!