

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారవడంతో టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. విడుదల తేదీ ముందుగానే ఖరారు కావడంతో థియేటర్ల కేటాయింపుల విషయంలో కూడా మేకర్స్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయం ప్రభావం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘NBK111’పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను మొదట దసరా సీజన్‌లో విడుదల చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ విడుదలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. డిసెంబర్ 4 తేదీని పరిశీలిస్తున్న సమయంలో ‘ఫౌజీ’ అదే వారంలో విడుదలవుతుండటంతో మేకర్స్ కొత్త తేదీలను పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌లోనే విడుదల చేస్తారా లేక వేరే సీజన్‌ను ఎంచుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!