

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అంచనాలను పెంచుతోంది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో ప్రారంభం కానుందట. రద్దీగా ఉండే ఓ మార్కెట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ సీన్ సాగుతుందని, విలన్ల దాడి సమయంలో అల్లు అర్జున్ పాత్ర పేరును ప్రత్యేకంగా పరిచయం చేసి భారీ ఇంపాక్ట్ వచ్చేలా రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలోని ఓ డాన్ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పడుకోణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం. దీంతో ‘రాకా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!