31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

Writer: Shivani K 09:31 AM, 31 ఆగస్టు, 2026
‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రజినీకాంత్ డెడ్లి డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని కూడా నటిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇందులో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రామ్ పోతినేని ఇప్పటికే ‘ధర్మన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. దీంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రస్తుతం రామ్ పోతినేని తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు ‘ధర్మన్’ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాల చిత్రీకరణకు ఆయన ఎలాంటి గ్యాప్ లేకుండా డేట్స్ కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ‘ధర్మన్’లో రామ్ పోతినేని పాత్ర సాధారణ అతిథి పాత్ర కాదని, కథలో కీలకమైన స్థాయిలో ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రజినీకాంత్‌తో ఆయనకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రామ్ పాత్ర, లుక్, విలన్ పాత్ర అనే వార్తలపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

ట్యాగ్లు
రజినీకాంత్ధర్మన్రామ్ పోతినేనిఅశ్వత్ మారిముత్తుకోలీవుడ్టాలీవుడ్రజినీ సినిమారామ్ కొత్త సినిమాసినిమా వార్తలుఎంటర్టైన్మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ
జనరల్

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా
జనరల్

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం
జనరల్

కాలువ లీకేజీతో కొండపల్లి రైతులకు పంట నష్టం

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!
సినిమాలు

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..
సినిమాలు

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?
గాసిప్స్

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?
సినిమాలు

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?
ఓటీటీ

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!