

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ కథానాయికల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతోంది. సరైన విజయాన్ని అందుకోవడానికి పలువురు హీరోయిన్లు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి వారిలో శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరూ మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ విజయాలు మాత్రం దక్కలేదు. అయితే తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం భాగ్యశ్రీ కెరీర్‌కు కీలక మలుపుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో తొలుత శ్రీలీలను కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ, కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆ అవకాశం భాగ్యశ్రీ బోర్సేకు దక్కింది.
ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్‌తో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సినిమాకు వస్తున్న ప్రశంసలు, భాగ్యశ్రీ పాత్రకు లభిస్తున్న స్పందన చూస్తుంటే ఈ విజయం శ్రీలీలకు కూడా మంచి మైలేజ్ ఇచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదృష్టం భాగ్యశ్రీ వైపు నిలవడంతో ఈ చిత్రం ఆమె కెరీర్లో కీలక బ్రేక్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలీల ఓ మంచి అవకాశాన్ని కోల్పోయిందనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!