

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన తదుపరి చిత్రం ‘డేర్ డెవిల్’ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, అజిత్‌తో ఆయనకు రెండో ప్రాజెక్ట్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, సినిమా నిర్మాణంలో ఆలస్యం కారణంగా ప్రధాన తారాగణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో కయాదు లోహర్‌ను కథానాయికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తొలుత మోహన్‌లాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇప్పుడు ఆ పాత్రలో ఉన్ని ముకుందన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అజిత్ భార్య షాలిని అజిత్‌కుమార్, బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. తారాగణంలో మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, సినిమా షూటింగ్ షెడ్యూల్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!