
జనరల్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆలస్యం అవుతుందనే వార్తలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం రిలీజ్ తేదీలో మార్పు లేదని సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కంటెంట్ నమూనాలు చూసిన వారు సినిమాను ‘ప్యూర్ మ్యాడ్‌నెస్’గా అభివర్ణిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుండగా, ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లో మరో మైలురాయి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!