

కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3 సినిమా త్వరలో థియేటర్లలోకి రానుందనే వార్తలతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. తమిళ సినీ వర్గాల్లో ప్రచారమవుతున్న కథనాల ప్రకారం, అదనపు సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు శంకర్ 25 రోజుల షూటింగ్‌కు అనుమతి కోరగా, లైకా ప్రొడక్షన్స్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరించిన ఫుటేజ్‌తోనే ఫైనల్ కట్ సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫుటేజ్ సినిమాకు సరిపోతుందని, మూడో భాగం కోసం మరింత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఈ వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సినిమా తుది రూపం, విడుదలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!