

భృంగరాజ్ అనేది అనేక శక్తివంతమైన సహజ రసాయన సమ్మేళనాలతో కూడిన ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. శతాబ్దాలుగా భారతీయ వైద్య విధానంలో దీని ఆకులు, కాండాలు, రసాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో భృంగరాజ్ కీలక పాత్ర పోషిస్తుంది. భృంగరాజ్ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, తెల్ల జుట్టు సమస్య మందగిస్తుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను తగ్గించి, సహజ కాంతిని పెంచుతాయి.
ఇక కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా భృంగరాజ్ సహాయపడుతుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తుంది. భృంగరాజ్ను రసం, పొడి, నూనె రూపాల్లో ఉపయోగించవచ్చు. అయితే అంతర్గతంగా తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరి. గర్భిణీలు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!