25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

Writer: Chandrika 11:27 PM, 24 అక్టోబర్, 2026
పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

వైద్య రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చైనా, రష్యాకు చెందిన వైద్యులు పక్షవాతానికి గురైన వ్యక్తికి వెన్నుపాము మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. కణజాలాలను అతికించేలా రూపొందించిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ఘనత సాధించారు.

చైనా సర్జన్ రెన్ జియావోపింగ్ ప్రకారం.. అక్టోబర్ 14, 15 తేదీల మధ్య దాదాపు 12 గంటల పాటు శ్రమించిన వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో రోగి వెన్నుపాములోని దెబ్బతిన్న భాగాన్ని బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన కణజాలంతో భర్తీ చేశారు. రష్యాలోని స్క్లిఫోసోవ్స్కీ అత్యవసర వైద్య పరిశోధనా సంస్థలో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు రెన్ తెలిపారు. ఆ రోగికి మూడేళ్ల కిందట వెన్నుపాముకు గాయమైంది. దెబ్బతిన్న భాగాన్ని తొలగించి, దాత నుంచి సేకరించిన భాగాన్ని దాని స్థానంలో వైద్యులు అమర్చారు. మైక్రోసర్జరీతో పాటు, కణ త్వచాలను కలపడానికి పాలిథిలిన్ గ్లైకాల్ అనే పదార్థాన్ని ఉపయోగించారు. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి వెన్నుపాము మార్పిడిగా రెన్ అభివర్ణించారు.

గ్వాంగ్జీ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న సెకండ్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌కు చెందిన తన బృందం, రష్యన్ వైద్య నిపుణుల సహకారంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు రెన్ వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ తల మార్పిడి శస్త్రచికిత్స చేస్తానని రెన్ గతంలో ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం వెన్నుముక మార్పిడి చేయడంతో భవిష్యుత్తులో తల మార్పిడి ఘనత సాధిస్తారని పలువురు వైద్య రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చియా సీడ్స్‌, సబ్జా గింజలు.. బరువు తగ్గేందుకు ఏవి ఎక్కువ ప్రయోజనకరం?

చియా సీడ్స్‌, సబ్జా గింజలు.. బరువు తగ్గేందుకు ఏవి ఎక్కువ ప్రయోజనకరం?

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!

హైబీపీ నియంత్రణకు బీట్‌రూట్ జ్యూస్ బెటరా.. దానిమ్మ రసమా?

హైబీపీ నియంత్రణకు బీట్‌రూట్ జ్యూస్ బెటరా.. దానిమ్మ రసమా?

జామ ఆకులతో జీర్ణ సమస్యలకు ఉపశమనం లభిస్తుందా? వైద్యులు చెబుతున్న విషయాలివే

జామ ఆకులతో జీర్ణ సమస్యలకు ఉపశమనం లభిస్తుందా? వైద్యులు చెబుతున్న విషయాలివే

ట్యాగ్లు
వైద్య రంగంచైనారష్యావైద్యులువెన్నుపాము మార్పిడికణజాలాలపక్షవాతం‎
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వాటర్ రిటెన్షన్‌తో బరువు పెరుగుతోందా? ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

వాటర్ రిటెన్షన్‌తో బరువు పెరుగుతోందా? ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

తేనెను అతిగా తీసుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు

తేనెను అతిగా తీసుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు
జనరల్

ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!
షోస్

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్
జనరల్

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ
జనరల్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు
ఆరోగ్యం

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత
ఆరోగ్యం

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
సినిమాలు

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్
సినిమాలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.
జనరల్

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!