

ధనుష్, అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్ తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత బలంగా నిలిచింది. అయితే ‘తిరు’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల ధనుష్ తన సినిమాలకు ఇతర సంగీత దర్శకులను ఎంపిక చేసుకుంటుండటం, ముఖ్యంగా ధనుష్ 56వ చిత్రానికి కూడా అనిరుధ్ పేరు లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
‘త్రీ’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డీ’ పాటతో ప్రారంభమైన ఈ విజయవంతమైన ప్రయాణం ఎన్నో హిట్ ఆల్బమ్స్ వరకు కొనసాగింది. ప్రస్తుతం ధనుష్ జీవీ ప్రకాష్, సాయి అభ్యంకర్ వంటి సంగీత దర్శకులతో పనిచేస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా వీరి కాంబినేషన్ ఆగిపోలేదని, అనిరుధ్ బిజీ షెడ్యూల్, భారీ పారితోషికమే కారణమని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో విరామం తర్వాత మళ్లీ కలిసి పనిచేసిన ఈ జోడీ భవిష్యత్తులో మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!