

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర బృందం ప్రత్యేక కానుక అందించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ డ్రామాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాను కల్పిత చారిత్రక ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, ఆయన పాత్ర శక్తివంతంగా, ఆసక్తికరంగా ఉండనుందని సమాచారం. ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు హను రాఘవపూడి శైలిలో భావోద్వేగాలు, ప్రేమకథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చిత్రానికి సంబంధించిన తదుపరి వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!