
జనరల్

సినీ నటి మెహరీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఆదివారం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు సమాచారం.
తెలుగు తెరపై కృష్ణగాడి వీర ప్రేమగాథతో పరిచయమైన మెహరీన్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ దగ్గుబాటి, వరుణ్ తేజ్లతో కలిసి నటించిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె వివాహ వార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!