

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. మహాసముద్రం, మంగళవారం, శ్రీనివాస మంగళపురం చిత్రాలను తెరకెక్కించిన ఆయన, గతంలో మంగళవారం సినిమాకు రెండో భాగం తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదలైన శ్రీనివాస మంగళపురం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, తదుపరి చిత్రంపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మంగళవారం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌ను ఆసక్తికరంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం మంగళవారం 2కు సంబంధించిన కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు అజయ్ భూపతి సిద్ధమవుతున్నారట. ఆయన స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపడుతూనే, చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మంగళవారం సీక్వెల్‌పై దర్శకుడు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొస్తారో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!